Ramgopal Varma: ఇక కడప రెడ్ల నిజాలు చెబుతా: రాంగోపాల్ వర్మ

  • కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న రాంగోపాల్ వర్మ
  • 'కడప' పేరిట వెబ్ సిరీస్
  • ఫ్యాక్షన్ రాజకీయాల గురించి చెబుతా
  • రక్తపుటేరులను చూపిస్తానంటున్న వర్మ
గత వారం, పది రోజులుగా సైలెంట్ గా ఉన్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, మరోసారి తన ఫేస్ బుక్ ఖాతాలో ఆకర్షించే పోస్టును పెట్టాడు. డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించిన తరువాత 'గన్స్ అండ్ థైస్' పేరిట తాను విడుదల చేసిన సిరీస్ విజయవంతం అయిందని, అదే స్ఫూర్తితో ఇప్పుడు తొలిసారిగా పూర్తి తెలుగులో ఓ సిరీస్ ను తయారు చేస్తున్నానని ప్రకటించాడు.

అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తెలుగు అభిమానుల కోసం ఈ సిరీస్ ను 'కడప' పేరిట ఫ్యాక్షన్ రాజకీయాలపై తయారు చేస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ రీజియన్ లో పారిన రక్తపుటేరులు తన సిరీస్ లో చూపిస్తానని, అధికారం కోసం జరిగే హింస ప్రధానంగా సాగుతుందని చెప్పాడు.
Ramgopal Varma
Kadapa
Faction
Web Series

More Telugu News