తెలంగాణలో భారీ ఎన్ కౌంటర్... ఎనిమిది మంది మావోలను హతమార్చిన పోలీసులు!
- టేకులపల్లి మండలంలో ఘటన
- కూంబింగ్ దళాలకు ఎదురైన మావోలు
- అజ్ఞాత దళానికి చెందిన సభ్యులు మృతి
మావోల వైపు నుంచి ఫైరింగ్ మొదలు కావడంతో, కూంబింగ్ దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్ కౌంటర్ లో సీపీ బాటకు చెందిన అజ్ఞాత దళ సభ్యులు ఎనిమిది మంది మృతి చెందారు. ఘటనా స్థలి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నామని, వీరు ఎవరన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎన్ కౌంటర్ పై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.