Rohit Sharma: రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్.. ఆనందబాష్పాలు రాల్చిన భార్య!

  • మొహాలీలో రోహిత్ డబుల్ సెంచరీ
  • వన్డేల్లో మూడు డబుల్స్ సాధించిన ఏకైక బ్యాట్స్ మెన్ గా రికార్డ్
  • భారత్ స్కోరు 392/4
మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు రోహిత్ శర్మ. టీమిండియా కెప్టెన్ దెబ్బకు లంక ఆటగాళ్లు కళ్లు తేలేశారు. సిక్సర్లను ఇంత అలవోకగా కూడా కొట్టొచ్చా? అనే రీతిలో రోహిత్ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో రోహిత్ డబుల్ సెంచరీ కొట్టాడు. 151 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 12 సిక్సర్లు, 13 ఫోర్ల సాయంతో ద్విశతకం (201) సాధించాడు. ఈ క్రమంలో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా రోహిత్ అవతరించాడు. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసిన క్షణంలో అతని భార్య రితిక తీవ్ర ఉద్వేగానికి లోనయింది. స్టేడియంలో ఉన్న ఆమె ఆనందభాష్పాలు రాల్చింది.

మరోవైపు టీమిండియా బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్  4 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. రోహిత్ 208 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ధావన్ 68, అయ్యర్ 88, ధోనీ 7, పాండ్యా 8 పరుగులు చేశాడు. చివరి బంతికి పాండ్యా ఔట్ అయ్యాడు. లంక బౌలర్లలో ఫెర్నాండో 3, పతిరన ఒక్క వికెట్ తీశారు.
.
Rohit Sharma
team india
sri lanka cricket

More Telugu News