India: భారత తుది జట్టులోకి అనూహ్యంగా వచ్చి చేరిన నూతన ఆటగాడు వాషింగ్టన్ సుందర్

  • అతి పిన్న వయస్కుల్లో ఏడోవాడు
  • నేడు తొలి మ్యాచ్ ద్వారా అరంగేట్రం
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లంక

మొహాలీలో జరగనున్న రెండో వన్డే పోటీలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుని టెస్టు సిరీస్ లో తమకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. పేస్ కు అనుకూలించే పిచ్ పై తొలుత ఫీల్డింగ్ చేసి, మైదానంలోని మంచును ఉపయోగించుకుని ఇండియా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాలన్నది లంక ప్లాన్. భారత జట్టు తన తుది జాబితాలోకి అనూహ్యంగా బ్యాట్స్ మెన్ వాషింగ్టన్ సుందర్ ను చేర్చింది. ఇండియా తరఫున వన్డే క్రికెట్ లో అరంగేట్రం చేయనున్న అత్యంత పిన్న వయస్కుల్లో వాషింగ్టన్ సుందర్ ఏడో వాడు కావడం గమనార్హం. ఇతని వయసు 18 ఏళ్లు. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

More Telugu News