Mahesh Babu: వాణిజ్య ప్రకటన కోసం కలిసి నటించిన మహేష్ బాబు, రణవీర్ సింగ్.. ఫొటో వైరల్

  • థమ్స్అప్ యాడ్ లో నటించిన స్టార్ హీరోలు
  • కాలిఫోర్నియాలో షూటింగ్
  • ఫొటోలను షేర్ చేసిన నమ్రత

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు దక్షిణాదిలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ ఏ రేంజ్ లో దూసుకుపోతున్నాడో తెలియంది కాదు. వీరిద్దరూ కలసి నటిస్తే, ఇక అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోగలం. మహేష్, రణవీర్ లు ఇద్దరూ కలసి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. రేసర్లుగా దుస్తులు ధరించి నటించిన సన్నివేశాలను నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టాగ్రామ్ లో ఉంచారు. నాస్కార్ రేస్ ట్రాక్ లో థమ్స్ అప్ యాడ్ కోసం వీరు కలసి నటించారు. ఈ షూటింగ్ లో తమ కుమారుడు గౌతమ్ కూడా పాల్గొన్నాడని నమ్రత పేర్కొన్నారు.

More Telugu News