actor vijay: నా భర్త ఆత్మహత్యకు ఆయన తండ్రే కారణం: నటుడు విజయ్ భార్య

  • స్థలం వ్యవహారంలో నా భర్తకు, ఆయన తండ్రికి విభేదాలున్నాయి
  • ఆత్మహత్యకు ఇదే కారణం కావచ్చు
  • నిజాలు ఏనాటికైనా వెలుగులోకి వస్తాయి

ఆత్మహత్యకు పాల్పడ్డ కమెడియన్ విజయ్ భార్య వనితపై ఆయన తండ్రి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వనిత ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఇందులో పలు అనుమానాలను వ్యక్తం చేసింది. ఆదివారం మధ్యాహ్నం వరకు సంతోషంగానే ఉన్న విజయ్... రాత్రి ఎందుకు ఉరి వేసుకున్నాడని ఆమె ప్రశ్నించింది.

ఒక స్థలం వ్యవహారంలో విజయ్ కు, అతని తండ్రికి విభేదాలు ఉన్నాయని చెప్పింది. తండ్రి కారణంగానే విజయ్ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. విజయ్ ఆత్మహత్య అనంతరం పక్కా ప్లాన్ తో వారంతా తనపై నిందలు మోపుతున్నారని తెలిపింది. విజయ్ ఆత్మహత్యకు తాను కారణం కాదని... నిజాలు ఏనాటికైనా వెలుగులోకి వస్తాయని చెప్పింది.


  • Loading...

More Telugu News