అమ్మాయిలకు సల్మాన్ ఖాన్ సలహా

Tue, Dec 12, 2017, 12:33 PM
  • అమ్మాయిల రక్షణ కోసం హిమ్మత్ యాప్
  • అందుబాటులోకి తెచ్చిన ఢిల్లీ పోలీసులు
  • అందరూ ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్న సల్మాన్
మన దేశంలో అమ్మాయిలు, వివాహిత మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతేలేకుండా పోతోంది. పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కామాంధులు బరి తెగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మహిళల రక్షణ కోసం 'హిమ్మత్ యాప్'ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ ను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా ఢిల్లీ విమానాశ్రయంలో లాంచ్ చేయించారు.

ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ, హిమ్మత్ యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవాలని... ఆకతాయిల నుంచి రక్షణ పొందాలని పిలుపునిచ్చాడు. పోలీస్ కమిషనర్ సంజయ్ బేనివాల్ మాట్లాడుతూ, రక్షణ కోసం ప్రతి ఒక్కరు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. పోలీసు కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు సల్మాన్ తో పాటు అలియా భట్, షబానా అజ్మీ, కరీనా కపూర్, విద్యాబాలన్, ఇర్ఫాన్ ఖాన్ లు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha