rajanikanth: రజనీజీ... మీరు విజయం సాధించాలి!: చంద్రబాబునాయడు

  • నేడు రజనీకాంత్ పుట్టిన రోజు
  • అభినందనలు తెలిపిన చంద్రబాబునాయుడు
  • ట్విట్టర్ ఖాతాలో శుభాకాంక్షలు

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుభాభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆదర్శనటుడికి పుట్టిన రోజు అభినందనలని, ఆయన్ను విజయం వరించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

More Telugu News