Rajinikanth: నేడు రజనీకాంత్ బర్త్ డే.. రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ ఇవ్వనున్న తలైవా!

  • తమిళనాడులో పండుగ వాతావరణం
  • పొలిటికల్ ఎంట్రీ ప్రకటనపై అభిమానుల్లో ఉత్కంఠ
  • ఇప్పటికే స్పష్టత ఇచ్చిన కమల్, విశాల్
నేడు తమిళనాడులో పండుగ రోజు. ఆ మాట కొస్తే సూపర్ సార్ట్ రజనీకాంత్ అభిమానులందరూ సంబరాలు జరుపుకునే రోజు. ఎందుకంటే, నేడు రజనీకాంత్ బర్త్ డే. రజనీకాంత్ పుట్టిన రోజంటే మాటలు కాదు. తమిళనాడులో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఫ్యాన్స్ నుంచి కోలీవుడ్ ఇండ్రస్ట్రీ వరకు ఆయన నామస్మరణలో ఊగిపోతుంది. సాధారణంగా ప్రతి ఏడాదీ జరిగేది ఇదే. అయితే నేటి బర్త్ డేకు కొంత ఉత్కంఠ కూడా తోడైంది.

తలైవా రాజకీయ రంగ ప్రవేశంపై గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రాజకీయాల్లోకి ఆయన రావడం ఖాయమని కొందరు, రారని ఇంకొందరు చెబుతున్నారు. ఈ విషయమై గతంలో అభిమానులతో సమావేశాలు నిర్వహించిన రజనీకాంత్ వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. అయితే రాజకీయ అరంగేట్రంపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడంతో ఊహాగానాలు హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి.

రాజకీయ రంగ ప్రవేశంపై మరో ఇద్దరు స్టార్‌లు కమలహాసన్, విశాల్‌లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు సీన్ మొత్తం రజనీకాంత్ వైపే మళ్లింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చేది.. లేనిది నేడు తేల్చేస్తారని సమాచారం. బర్త్ డే సందర్భంగా పొలిటికల్ ఎంట్రీపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ విషయంలో నాన్చుడు ధోరణి పనికిరాదని, ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్న రజనీకాంత్ నేడు అందుకు సంబంధించిన ప్రకటన చేయనున్నట్టు చెబుతున్నారు. ఆయన ప్రకటన కోసం అభిమానులే కాదు, దేశమొత్తం ఎదురుచూస్తోంది. కాగా, నేటితో 66 వసంతాలు పూర్తి చేసుకుని 67వ ఏట ప్రవేశించనున్న రజనీకాంత్ ఈ ఏడాది కూడా వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
Rajinikanth
Tamilnadu
Birthday

More Telugu News