Thiefs: కుటుంబ స‌మేతంగా వెళ్లి దొంగ‌త‌నాలు చేస్తోన్న వైనం!

  • కొన్ని రోజులుగా వికారాబాద్‌లో చోరీలు
  • తాండూరు రైల్వే స్టేష‌న్‌లో కుటుంబ స‌భ్యుల అరెస్ట్‌
  • రూ. 6,92,000 విలువ చేసే బంగారు నగలు స్వాధీనం

ఓ కుటుంబంలోని వ్య‌క్తులంతా క‌లిసి దొంగ‌త‌నాలు చేస్తోన్న ఘ‌ట‌నలు కొన్ని రోజులుగా వికారాబాద్‌లో చోటు చేసుకుంటున్నాయి. ఎట్ట‌కేల‌కు వారిని గుర్తించిన పోలీసులు.. అరెస్టు చేసి, మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ కుటుంబంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాక‌ కర్ణాటక, మహారాష్ట్రలోనూ కేసులు న‌మోద‌యిన‌ట్లు పోలీసులు చెప్పారు. వీరిని తాండూరు రైల్వేస్టేషన్ సమీపంలో అరెస్టు చేశామ‌ని చెప్పారు. న‌లుగురు కుటుంబ స‌భ్యుల‌ నుంచి సుమారు రూ. 6,92,000 విలువ చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామ‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు.  

  • Loading...

More Telugu News