dhanraj: హాస్య‌న‌టుడు విజ‌య్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం అది కాదు: సినీన‌టుడు ధ‌న్‌రాజ్

  • సినిమాల్లో అవ‌కాశం రాక ఆత్మ‌హత్య చేసుకున్నాడ‌ని అంటున్నారు
  • విజ‌య్ ప్ర‌స్తుతం రెండు, మూడు సినిమాల్లో చేస్తున్నాడు
  • పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు
  • విజ‌య్ త‌ల్లి ప‌రిస్థితి చూస్తోంటే చాలా బాధేస్తోంది

హైద‌రాబాద్‌లోని యూస‌ఫ్‌గూడలో త‌న నివాసంలో ఉరివేసుకుని హాస్య‌న‌టుడు విజ‌య్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. సినిమాల్లో అవ‌కాశాలు రాకే ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని కొంద‌రు అనుమానం వ్య‌క్తం చేస్తుండ‌డం ప‌ట్ల సినీన‌టుడు ధ‌న్‌రాజ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. కొద్ది సేప‌టి క్రితం ధ‌న్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. సినిమా అవ‌కాశాలు లేక ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌న్న‌ది నిజం కాద‌ని తాను అనుకుంటున్నాన‌ని పేర్కొన్నాడు.

విజ‌య్ ప్ర‌స్తుతం రెండు, మూడు సినిమాలు చేస్తున్నాడ‌ని ధ‌న్‌రాజ్ తెలిపాడు. విజ‌య్‌కి వ్య‌క్తిగ‌త కష్టాలు ఏమున్నాయో త‌న‌కు తెలియ‌ద‌ని అన్నాడు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నార‌ని చెప్పాడు. ఏదేమైనా విజ‌య్ ఇటువంటి ఘ‌ట‌న‌కు పాల్ప‌డ‌కుండా ఉండి ఉంటే బాగుండేద‌ని అన్నాడు. విజ‌య్ త‌ల్లి ప‌రిస్థితి చూస్తోంటే చాలా బాధేస్తోంద‌ని వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News