richa chadda: మాట మార్చిన రిచా చద్దా.. తనను వదిలేయాలని వేడుకుంటున్న హీరోయిన్!

  • కాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్
  • రక్షణ కల్పిస్తే, పేర్లు చెబుతామన్న రిచా
  • ఆపై మాట మార్చిన హీరోయిన్
భారత సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేసిన నటి రిచా చద్ధా మరోసారి ట్విట్టర్ వేదికగా తెరపైకి వచ్చింది. ఇటీవల 'పీటీఐ' వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ, తనతో పాటు, తన కొలీగ్స్ ఎంతో మంది లైంగిక వేధింపులకు గురయ్యారని, రక్షణ కల్పిస్తామన్న హామీ వస్తే, హార్వే వీన్ స్టెయిన్ ఘాతుకాల వంటివి ఎన్నో బయటకు వస్తాయని సంచలన కామెంట్స్ చేసింది.

రిచా వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ నుంచి ఏం జరిగిందో చెప్పాలన్న ఒత్తిడి పెరగడంతో, ఆమె తన ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చుకుంది. "నాకు ఏ సెక్యూరిటీ అవసరం లేదు. 'నేను' అన్న పదాన్ని ఓ ఉదాహరణగా మాత్రమే ఇంటర్వ్యూలో వాడాను. ఇక ఈ అయోమయానికి స్వస్తి పలకండి. చెప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. దయచేసి నన్ను ఒంటరిగా విడవండి" అని వ్యాఖ్యానించింది. తాను ఆ వ్యాఖ్యలను తప్పుగా చేశానని, తనను వదిలేయాలని వేడుకుంది.
richa chadda
Casting couch
Film Industry

More Telugu News