మంత్రి గంటా: మంత్రి గంటాకు అందాల పోటీల నిరసన సెగ!

  • అందాల పోటీలను బహిష్కరించాలి
  • గంటా నివాసం ముందు ఆందోళన
  • మహిళా సంఘాల ప్రతినిధుల డిమాండ్

అందాల పోటీల నిరసన సెగ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తగిలింది. మిస్ వైజాగ్ -2017 అందాల పోటీలను బహిష్కరించాలని మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన చేస్తూ ఆయన నివాసం ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గంటా స్పందిస్తూ, పోటీలు నిర్వహించే తీరుతెన్నులు తెలుసుకుని ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా, మహిళల అంగాంగ ప్రదర్శన చేయడం 1986 యాక్టు కింద నేరమని, ఈ పోటీలను తక్షణమే నిలిపివేయాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News