Sharuk Khan: 'విరుష్క' కోసం ఇటలీ విమానం ఎక్కుతున్న షారుక్, అమీర్, దీపిక!

  • పెళ్లికి ఆహ్వానం అందుకున్న షారుక్, అమీర్
  • సంగీత్ నుంచే బాలీవుడ్ సందడి
  • మూడు రోజుల పాటు ఇటలీలో మకాం వేయనున్న స్టార్స్
మరో రెండు రోజుల్లో ఒకటికానున్న సెలబ్రిటీ జంట విరాట్ కోహ్లీ, అనుష్కలను ఆశీర్వదించేందుకు బాలీవుడ్ హీరోలు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ లతో పాటు హీరోయిన్ దీపికా పదుకొనే ఇటలీకి బయలుదేరుతున్నారు. వీరిద్దరి పెళ్లికి అతిథులుగా హాజరుకానున్న వీరు, సంగీత్ కార్యక్రమం నుంచే ఉంటారని, మూడు రోజులూ ఇటలీలో బస చేయనున్నారని తెలుస్తోంది. వీరితో పాటు అనుష్క స్నేహితుల్లో ఒకరైన ఆదిత్య చోప్రా కూడా లండన్ వెళ్లనున్నాడు. ఇక అనుష్క తండ్రి అజయ్ కుమార్ శర్మ, తన ఇంటి చుట్టుపక్కల వారిని, బంధువులను పెళ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రాలు కూడా పంచినట్టు సమాచారం.
Sharuk Khan
Ameer Khan
Virat Kohli
Anushka Sharma

More Telugu News