Huawei: బీ రెడీ! జనవరి 8న వచ్చేస్తున్న 'ఆనర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' స్మార్ట్‌ఫోన్!

  • వచ్చే నెలలో భారత్ సహా పలు దేశాల్లో ఫోన్ విడుదల
  • పూర్తి ఏఐ సాంకేతికత.. ధర రూ.40వేలు
  • బోల్డన్ని ప్రత్యేకతలు

చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ హువేయి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి వచ్చేస్తోంది. పూర్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (ఏఐ)తో రూపొందించిన లేటెస్ట్ స్మార్ట్‌ ఫోన్ ‘ఆనర్ వ్యూ 10’ను జనవరి 8న మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఫోన్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడంతోపాటు ఫంక్షన్స్‌ని ఎప్పటికప్పుడు కస్టమైజ్ చేసుకోవడం ఈ ఫోన్ ప్రత్యేకత.

జనవరి 8న ఎంపిక చేసిన మార్కెట్లలో ‘ఆనర్ వ్యూ 10’ను విడుదల చేయనున్నట్టు ఆ సంస్థ ప్రెసిడెంట్ జార్జ్ ఝావో తెలిపారు. పశ్చిమ యూరోప్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌తోపాటు భారత్, మలేసియా, రష్యా, అమెరికా మార్కెట్లలో దీనిని విడుదల చేయనున్నట్టు వివరించారు.

‘ఆనర్ వ్యూ 10’లోని ఏఐ సాంకేతికత ప్రత్యేకత ఏమిటంటే, ఫోన్‌ను ఎవరు వాడుతున్నారో గుర్తించడంతోపాటు యూజర్ ఎంచుకున్న భాషలోకి మెసేజ్‌లను ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఫోన్‌ను యూజర్ ఎలా ఉపయోగిస్తున్నాడో గుర్తించి అందుకు అనుగుణంగా కస్టమైజ్ అవుతుంది.

64జీబీ ర్యామ్ 128జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఈ ఫోన్ ధర 499 యూరోలు. భారత కరెన్సీలో దాదాపు రూ.40 వేలు. యాపిల్, గూగుల్ ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుందని హువేయి పేర్కొంది. కాగా, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్‌లో ఆనర్ ఫోన్ల విక్రయాలు రెండింతలు  పెరిగినట్టు హువేయి తెలిపింది.

More Telugu News