Revanth Reddy: తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవడానికే కాంగ్రెస్‌లో చేరా!: రేవంత్ రెడ్డి

  • కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది
  • తెలంగాణ ఇచ్చింది
  • మ‌లిద‌శ ఉద్యమంలో తెలంగాణ వ‌చ్చింది
  • ఇప్పుడు జ‌రుగుతున్న‌ది తుదిద‌శ ఉద్య‌మం

మ‌లిద‌శ ఉద్యమంలో తెలంగాణ వ‌చ్చింద‌ని, 2015-2019 వ‌ర‌కు జ‌రుగుతోన్న ధ‌ర్మ‌యుద్ధ‌మే తుదిద‌శ ఉద్య‌మ‌మ‌ని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాల‌న పోవాల‌ని వ్యాఖ్యానించారు ఈ రోజు సోనియా గాంధీ పుట్టిన రోజు సంద‌ర్భంగా టీపీసీసీ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆయ‌న మాట్లాడుతూ.. ఆనాడు డిసెంబ‌రు 9న తెలంగాణ కోసం ప్ర‌క‌ట‌న చేశార‌ని, అనంత‌రం తెలంగాణ బిడ్డ‌ల త్యాగాల కార‌ణంగా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. 60 సంవ‌త్స‌రాల తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర క‌ల నెర‌వేరింద‌ని అన్నారు.

నేటి నుంచి కేసీఆర్ వ్య‌తిరేక పున‌రేకీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని అన్నారు. సోనియా గాంధీ, కాంగ్రెస్ వ‌ల్ల తెలంగాణ వ‌స్తే.. నలుగురి కుటుంబ పాల‌న వ‌ల్ల తెలంగాణ అల్లాడిపోతోంద‌ని అన్నారు. ఇప్ప‌టికీ ఆత్మ‌ బ‌లిదానాలు ఆగ‌లేద‌ని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికే తాము కాంగ్రెస్‌లో చేరామ‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింద‌ని కేటీఆర్ అంటున్నార‌ని, కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింద‌ని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెసని తెలిపారు. దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేస్తోంద‌ని అన్నారు.   

More Telugu News