అంతసీన్ లేదు.. నేను అరెస్ట్ కాలేదు.. ఆ వార్త‌లు న‌మ్మ‌కండి: మ‌హేశ్ క‌త్తి వీడియో

09-12-2017 Sat 17:46
  • ఫేస్‌బుక్‌లో మోదీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన మ‌హేశ్ క‌త్తి
  • పోలీసుల‌కు ట్విట్ట‌ర్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిర్యాదు
  • ఎంత వ‌ర‌కు మాట్లాడితే మ‌నకి ఏమి కాదో ఆ విష‌యాలు నాకు తెలుసు
  • నాకు నా హ‌క్కులు తెలుసు- మ‌హేశ్ క‌త్తి
ఫేస్‌బుక్‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన మ‌హేశ్ క‌త్తిపై ట్విట్ట‌ర్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌చారం అవుతోన్న వార్త‌ల‌పై మ‌హేశ్ క‌త్తి ఫేస్‌బుక్‌లైవ్‌లో మాట్లాడారు. "నేను అరెస్ట్ అయిన‌ట్లుగా కొన్ని న్యూస్ ఛానెళ్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. నేనేమీ అరెస్టు కాలేదు.. అరెస్టు అయ్యేంత కేసు కూడా కాదు అది. కేవ‌లం ట్విట్ట‌ర్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

నేను మోదీని న‌ర‌హంత‌కుడు అన్నాన‌ని, అరెస్టు చేయండ‌ని ట్విట్ట‌ర్‌లోనే ఫిర్యాదు చేశారు. న‌న్ను అరెస్టు చేయ‌లేదు. బీ కూల్‌.. న‌న్ను ఎవ్వ‌రూ అరెస్టు చేయ‌లేరు.. నేను స్వ‌తంత్రుడిని.. ఎంత వ‌ర‌కు మాట్లాడితే మ‌నకి ఏమి కాదో ఆ విష‌యాలు నాకు తెలుసు. నాకు నా హ‌క్కులు తెలుసు. అస‌లు అరెస్టుకే ఆస్కారం లేదు. ఇందాకా ఇద్ద‌రు, ముగ్గురు మిత్రులు నాకు ఫోన్ చేశారు. మీడియాలో నేను అరెస్ట‌య్యాన‌ని వార్త‌లు వ‌స్తున్నాయ‌"ని చెప్పారు.