america: సుమారు 60 ఏళ్ల నాటి హ‌త్య‌ కేసు వీడింది...!

  • నేరం ఒప్పుకున్న అనుమానితుడు
  • జీవిత‌ఖైదు విధించిన టెక్సాస్ న్యాయ‌స్థానం
  • లైంగిక దాడి చేసి హ‌త్య‌కు పాల్పడిన చ‌ర్చి ఫాద‌ర్‌

ఎప్పుడో అర‌వై ఏళ్ల కింద‌ట జ‌రిగిన హ‌త్య‌లో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ అమెరికాలోని టెక్సాస్ కోర్టు తీర్పునిచ్చింది. 1960 ఏప్రిల్‌లో టెక్సాస్‌కి చెందిన ఇరెనె గార్జాపై మెక్ అలెన్‌లోని చ‌ర్చి ఫాద‌ర్ జాన్ ఫీట్ లైంగిక దాడి చేసి హ‌త్య చేశాడు. ఇటీవ‌ల ఈ కేసుకు సంబంధించిన విచార‌ణ‌లో జాన్ నేరం అంగీక‌రించాడు. ఆ హ‌త్య చేసిన‌పుడు అత‌ని వ‌య‌సు 27 ఏళ్లు.

స్కూల్ టీచ‌ర్‌గా ప‌నిచేసే ఇరెనె గార్జా హ‌త్య అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఆమెను చివ‌రిసారిగా చ‌ర్చి ఫాద‌ర్ జాన్ ఫీట్‌తో చూసిన‌ట్లు స్థానికులు చెప్ప‌డంతో ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో జాన్‌ను అనుమానితుడిగా చేర్చారు. త‌ర్వాత ఇన్నేళ్ల‌కు జాన్ నేరాన్ని ఒప్పుకుంటూ, గార్జా మీద లైంగిక దాడి చేసి, ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో ఆమె ముఖాన్ని చుట్టి ఊపిరాడ‌కుండా చేసి హ‌త్య చేశాన‌ని చెప్పాడు. ఈ కేసులో శుక్రవారం విచారణ చేపట్టిన టెక్సాస్‌ న్యాయస్థానం.. అతడిని దోషిగా తేల్చి, అతడికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.

  • Loading...

More Telugu News