'2.ఓ' విడుదల జాప్యానికి కారణం వీఎఫ్ఎక్స్ సంస్థ... దావా వేసిన నిర్మాతలు!
- అనుకున్న సమయానికి సినిమాను అందజేయలేకపోయిన సంస్థ
- అకాడమీ అవార్డు కూడా అందుకున్న వీఎఫ్ఎక్స్ సంస్థ
- తమని మోసం చేసిందని ఆరోపిస్తున్న నిర్మాతలు
అయితే సంస్థ పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన నిర్మాతలు దానిపై దావా వేశారట. అకాడమీ అవార్డు అందుకున్న ఆ సంస్థ తమను మోసం చేసిందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఆ సంస్థ జాప్యం చేసి ఉండకపోతే ఈపాటికి సినిమా కూడా విడుదలై ఉండేదని వారు చెబుతున్నారు. ఎట్టకేలకు ఏప్రిల్‌లో విడుదల చేద్దామని భావించినప్పటికీ అప్పటికి కూడా పూర్తవుతుందో లేదోనన్న అనుమానంతో నిర్మాతలు దావా వేసినట్లు తెలుస్తోంది.