modi: మూడున్న‌రేళ్ల‌లో మోదీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌ల కోసం పెట్టిన ఖ‌ర్చు... అక్ష‌రాల రూ. 3,755 కోట్లు!

  • ఏప్రిల్ 2014 - అక్టోబ‌ర్ 2017 మ‌ధ్య ఖ‌ర్చు రూ.37,54,06,23,616
  • వెల్ల‌డించిన ఆర్టీఐ
  • ప్ర‌శ్న అడిగిన గ్రేట‌ర్ నోయిడా సామాజికవాది రామ్‌వీర్ త‌న్వ‌ర్‌

ప‌త్రిక‌లు, టీవీల్లో ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌నలు, బ‌య‌ట ప్ర‌చారాల కోసం ప్ర‌భుత్వం ఎంత ఖ‌ర్చు చేసిందో తెలియ‌జేయాలంటూ గ్రేట‌ర్ నోయిడాకు చెందిన సామాజికవాది రామ్‌వీర్ త‌న్వ‌ర్ స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా కోరాడు. దీనికి ఆర్టీఐ స‌మాధాన‌మిచ్చింది. అందులో ఏప్రిల్ 2014 - అక్టోబ‌ర్ 2017 మ‌ధ్య మూడున్న‌రేళ్ల కాలంలో అక్ష‌రాల  రూ. 37,54,06,23,616 ఖ‌ర్చు పెట్టిన‌ట్లు ఉంది.

ఇందులో రేడియో, టీవీ, డిజిట‌ల్ సినిమా, ఇంట‌ర్నెట్‌, ఎస్సెమ్మెస్ వంటి ఎల‌క్ట్రానిక్ మీడియా కోసం రూ. 1,656 కోట్ల‌కి పైగా ఖ‌ర్చుపెట్టిన‌ట్లు పేర్కొంది. అలాగే ప్రింట్ మీడియా కోసం రూ. 1,698 కోట్లు, ఇక పోస్ట‌ర్లు, ఫ్లెక్సీలు, బుక్‌లెట్లు, క్యాలెండ‌ర్లు వంటి బ‌య‌టి ప్రచారాల కోసం రూ. 399 కోట్లు ఖ‌ర్చుపెట్టినట్లు వెల్ల‌డించింది. ప్ర‌చారం కోసం ఖర్చు పెట్టిన డ‌బ్బు, బ‌డ్జెట్‌లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల కోసం కేటాయించిన మొత్తానికంటే ఎక్కువ ఉండ‌టం గ‌మ‌నార్హం.

More Telugu News