mukhesh ambani: ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి కార్డు ఖరీదు లక్షన్నర రూపాయలు?

  • ముఖేష్ కుమారుడు ఆకాశ్ పెళ్లి
  • పెళ్లి కార్డుకు సంబంధించి వార్త వైరల్
  • ఒక్కో కార్డు ధర రూ. లక్షన్నర

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి ఎప్పుడు అనే విషయం ఇంకా బయటకు వెల్లడి కాకపోయినప్పటికీ... పెళ్లి కార్డుకు సంబంధించిన ఓ వార్త మాత్రం సంచలనం రేకెత్తిస్తోంది. ఒక్కో కార్డు ధర లక్షన్నర రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. బంగారాన్ని వినియోగించి ఈ కార్డులను అద్భుతంగా తీర్చిదిద్దారని సమాచారం. ఈ నెల్లోనే వివాహం జరగనుందని తెలుస్తోంది. ఫోర్బ్స్ మేగజీన్ ముఖేష్ అంబానీని భారత్ లో అత్యంత ధనవంతుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News