సెక్షన్ 497: వివాహేతర సంబంధాల్లో శిక్ష పురుషులకేనా?: సెక్షన్ 497 ను సవాల్ చేస్తూ పిల్!

  • వివాహేతర సంబంధాల్లో మహిళలను విడిచిపెడుతున్నారు
  • ఐపీసీ 497 సెక్షన్ ను కొట్టివేయాలి
  • విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం

వివాహేతర సంబంధాలకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 497ను సవాల్  చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. భారత సంతతి వ్యక్తి జోసఫ్ షినే (40) ఈ పిల్ ను దాఖలు చేశారు. ఆయన వాదన ఏంటంటే.. ఐపీసీ 497 సెక్షన్ ప్రకారం ఏ వివాహిత వ్యక్తి అయినా మరో వివాహిత మహిళతో, ఆమె భర్త అనుమతి లేకుండా సంబంధం పెట్టుకుంటే అది వ్యభిచారంగా పరిగణిస్తారు.

ఈ వ్యవహారంలో పురుషునికి శిక్ష విధిస్తారు. మహిళకు ఎలాంటి శిక్షా ఉండదు. ఈ సెక్షన్ ప్రకారం కేవలం పురుషులనే శిక్షించి, మహిళలను విడిచిపెట్టడం తగదని, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ఈ సెక్షన్ ని కొట్టివేయాలని జోసఫ్ షినే కోరారు. ఈ వ్యాజ్యాన్ని నిన్న విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర, న్యాయమూర్తులు జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

More Telugu News