kathi mahesh: మా ఫేమిలీలో పుల్లలు పెట్టకు... కత్తి మహేష్ పై విరుచుకుపడ్డ బన్నీ వాసు!

  • ఉల్లికి లేని దురద 'కత్తి'కి ఎందుకు
  • కుటుంబంలో పుల్లలు పెట్టొద్దు
  • మహేష్ వ్యాఖ్యలకు బన్నీ వాసు కౌంటర్
అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ లో కీలక వ్యక్తి అయిన బన్నీవాసు... సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కత్తి మహేష్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. "ఏడవడం తప్పు కాదు పవన్ కల్యాణ్. చేతకాక, చెప్పుకోలేక ఏడవడం తప్పు. ఆ విషయం ఇప్పుడు చెప్పి... అల్లు అరవింద్ మీద పడి ఏడవడం అసలు తప్పు" అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై బన్నీ వాసు మండిపడ్డాడు. "అయ్య బాబోయ్... కుటుంబంలో పుల్లలు పెట్టే పనులు వద్దు. పవన్ ఏం అన్నారో మాకు తెలుసు. ఆయన మాటలకు అర్థం ఏమిటో కూడా మాకు తెలుసు. ఉల్లికి లేని దురద కత్తికి ఎందుకు?" అంటూ విమర్శించారు. 
kathi mahesh
bunny vasu
tollywood
pawan kalyan
allu aravind

More Telugu News