Lusiana: బెల్టు తీసుకుని కూతురిని 50 దెబ్బ‌లు కొట్టిన తండ్రి.. ఆ త‌రువాత గుండు గీసిన వైనం!

  • స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌చాట్ డౌన్‌లోడ్ చేయ‌డ‌మే ఆమె చేసిన నేరం
  • కూతురిని హింసించి వీడియో తీసిన తండ్రి
  • లూసియానాలో దారుణ ఘ‌ట‌న‌

పిల్ల‌ల‌కి తండ్రిని మించిన ర‌క్ష‌ణ ఎక్క‌డా దొర‌క‌ద‌ని అంటారు. బయట ఎవ‌రైనా తమని ఇబ్బందుల‌కు గురి చేస్తే తండ్రికి చెప్పుకుని ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. కానీ, లూసియానాలో ఓ అమ్మాయిపై ఆమె తండ్రే దాడికి పాల్ప‌డ్డాడు. ఇంట్లో కూతురిని అతి దారుణంగా కొట్టాడు. ఓ అమ్మాయి త‌న తండ్రి అలెక్స్‌ జే హారిసన్ నుంచి ఫోన్ తీసుకుంది. అనంత‌రం తన ఫోన్‌లో స్నాప్‌ చాట్‌ డౌన్‌లోడ్ చేసుకుంది. ఇంత చిన్న విష‌యానికే ఆ తండ్రి ఆగ్ర‌హావేశంతో ఇంట్లోని సోపాలో కూతురుని పడేశాడు.

 బెల్టు తీసుకొని 50 సార్లు పైగా కొట్టాడు. అంతేకాదు, ట్రిమ్మర్ తీసుకొచ్చి త‌న కూతురి జుట్టు మొత్తం కత్తిరించి గుండు చేశాడు. బాధ‌తో త‌ల్ల‌డిల్లిపోతోన్న‌ ఆ అమ్మాయి బాధ అంత‌టినీ త‌న‌ మొబైల్‌ కెమెరాలో రికార్డు చేసి ఆనందం పొందాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ తండ్రి వికృత చ‌ర్య‌పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.    

More Telugu News