Jagan: హైదరాబాద్ నుంచి అనంత‌పురానికి బ‌య‌లుదేరిన జ‌గ‌న్!

  • అక్ర‌మాస్తుల కేసులో ముగిసిన నేటి విచార‌ణ‌
  • రోడ్డు మార్గంలో బ‌య‌లుదేరిన జ‌గ‌న్‌
  • రేపు సింగనమల నియోజకవర్గంలోని పాపినేని పాలెంలో పాద‌యాత్ర‌
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ రోజు హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి సీబీఐ కోర్టుకు హాజ‌రైన విష‌యం తెలిసిందే. అక్ర‌మాస్తుల కేసులో ఈ రోజు విచార‌ణ ముగియ‌డంతో ఆయ‌న తిరిగి పాద‌యాత్ర చేయ‌డానికి రోడ్డు మార్గంలో అనంత‌పురం బ‌య‌లుదేరారు. వాదనలు ముగిసిన త‌రువాత న్యాయమూర్తి ఈ కేసు విచారణను వ‌చ్చే శుక్ర‌వారానికి వాయిదా వేశారు. ఈ రోజు రాత్రికి జగన్ అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజక వర్గంలోని బాపనపల్లికి చేరుకుంటారు. రేప‌టి నుంచి మ‌ళ్లీ పాద‌యాత్ర ప్రారంభిస్తారు. రేపు ఉదయం సింగనమల నియోజకవర్గంలోని పాపినేని పాలెంలో ప్ర‌జ‌ల‌తో స‌మావేశం అవుతారు.      
Jagan
ananthapur
Hyderabad
padayathra

More Telugu News