srivishnu: 'నీది నాదీ ఒకే కథ' మోషన్ టీజర్ రిలీజ్ కి అనూహ్యమైన రెస్పాన్స్

షార్ట్స్‌లో చూడండి
వైవిధ్యభరితమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ శ్రీవిష్ణు ముందుకు వెళుతున్నాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు' .. 'ఉన్నది ఒకటే జిందగీ' .. 'మెంటల్ మదిలో' సినిమాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.  శ్రీవిష్ణు సినిమాల్లో విషయం ఉంటుంది అనే నమ్మకం ప్రేక్షకులకి కలగడంతో, ఆయన తన తదుపరి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు.

 ఈ క్రమంలోనే ఆయన 'నీది నాదీ ఒకే కథ' సినిమా చేస్తున్నాడు. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి, తాజాగా మోషన్ టీజర్ ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ గా అనిపిస్తోన్న ఈ మోషన్ టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. కంటెంట్ లో ఏదో కొత్తదనం ఉందనే విషయం అర్థం కావడంతో, అందరిలో ఆసక్తి మొదలైంది. త్వరలోనే టీజర్ ను .. ఆడియోను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా శ్రీవిష్ణు కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
Go Back to Shorts
srivishnu

More Telugu News