Pawan Kalyan: నేడు చినకాకానిలో పవన్ పర్యటన.. పార్టీ కోసం భూమి ఇచ్చిన రైతులతో మాటామంతి!

  • పార్టీ కార్యాలయం నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించనున్న పవన్
  • ‘చలోరే చలోరే చల్’ పర్యటనతో రాజకీయాల్లో వేడి పుట్టించిన జనసేన చీఫ్
  • పోలవరం చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు
‘చలోరే చలోరే చల్‌’ పర్యటనతో ఏపీ రాజకీయాల్లో సెగ రాజేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు గుంటూ జిల్లా చినకాకానిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలిస్తారు. అలాగే పార్టీ కార్యాలయం కోసం భూమి ఇచ్చిన  రైతులతో పవన్ సమావేశం కానున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

 కాగా, తన పర్యటనలో భాగంగా గురువారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా పోలవరాన్ని సందర్శించడంతో ఏపీ రాజకీయం మొత్తం ఆ ప్రాజెక్టు చుట్టూ తిరుగుతోంది.
Pawan Kalyan
Guntur
Andhra Pradesh

More Telugu News