agnathavasi: ‘అజ్ఞాతవాసి’ గురించి మ‌రో అప్‌డేట్‌... డిసెంబ‌ర్ 12న రెండో పాట‌

  • 'గాలి వాలుగ‌...' అంటూ సాగ‌నున్న పాట‌
  • పాట పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన చిత్ర‌బృందం
  • ఆక‌ట్టుకుంటున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టిల్‌

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి సంబంధించి మ‌రో అప్‌డేట్‌ను చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. డిసెంబ‌ర్ 12న ఈ చిత్రంలోని రెండో పాటను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. 'గాలి వాలుగ‌...' అంటూ సాగ‌నున్న ఈ పాట‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను వారు సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు.

ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టైల్‌గా నిల‌బడిన స్టిల్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రంలో మొద‌టి పాట 'బ‌య‌టికొచ్చి చూస్తే....' అభిమానులను ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌లు హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

More Telugu News