time: టైమ్ మేగ‌జైన్ 'ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్‌'గా నిలిచిన #MeToo ఉద్య‌మ మ‌హిళ‌లు

  • లైంగిక వేధింపుల గురించి బ‌య‌ట‌పెట్టిన మ‌హిళ‌లు
  • 'ద సైలెన్స్ బ్రేక‌ర్స్‌' అంటూ ప్ర‌శంసించిన టైమ్‌
  • క‌వ‌ర్ పేజీ మీద ఐదుగురి ఫొటోలు

ఈ ఏడాది టైమ్ మేగ‌జైన్ 'ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్‌'గా #MeToo ఉద్య‌మాన్ని ప్రారంభించిన మ‌హిళ‌ల బృందం నిలిచింది. హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టెయిన్ చేతిలో వేధింపుల‌కు గురైన వారంతా ఈ #MeToo ట్యాగ్ ద్వారా ఒక్కొక్క‌రుగా త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని బ‌య‌ట‌పెట్టారు. వారిని ఆద‌ర్శంగా తీసుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మ‌హిళ‌లు త‌మ లైంగిక వేధింపుల క‌థ‌లను బ‌య‌టికి చెప్పారు.

ఎంతో మందిని ప్ర‌భావితం చేసిన ఈ ఉద్య‌మాన్ని గుర్తిస్తూ 'ద సైలెన్స్ బ్రేక‌ర్స్‌ (మౌనాన్ని ఛేదించినవారు)' అని టైమ్ మేగ‌జైన్ ప్ర‌చురించింది. అలాగే క‌వ‌ర్ పేజీ మీద ఈ ఉద్య‌మాన్ని న‌డిపిన‌ ఐదుగురు మ‌హిళ‌ల ఫొటోల‌ను ప్ర‌చురించింది. వారిలో న‌టి యాష్లీ జుడ్‌, ఉబెర్ మాజీ ఇంజినీర్ సూసెన్ ఫౌల‌ర్‌, అడామా ఇవూ, పాప్ గాయ‌ని టేల‌ర్ స్విఫ్ట్‌, ఇస‌బెల్ పాస్కుల్‌లు ఉన్నారు.

  • Loading...

More Telugu News