Mysore: మైసూరు రాజకుటుంబానికి వారసుడొచ్చాడు!

  • మగబిడ్డకు జన్మనిచ్చిన త్రిషికా దేవి
  • మైసూరు రాజ కుటుంబంలో 28వ తరం
  • తల్లీ బిడ్డా క్షేమమన్న ఆసుపత్రి వర్గాలు

మైసూరు రాజకుటుంబంలో కొత్త వారసుడు ఉదయించాడు. శ్రీ యదువీర కృష్ణదత్త చామరాజ వడయార్, త్రిషికా దేవి దంపతులకు పండంటి బాబు జన్మించాడు. వడయార్ వంశంలో ఈ బిడ్డ 28వ తరం వాడు అవుతాడు. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో పునర్వసు నక్షత్రంలో బిడ్డ పుట్టాడు. మైసూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో త్రిషికా దేవి జన్మనిచ్చిందని, బిడ్డ బరువు 3 కిలోలని, తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

మరిన్ని వివరాలను నేడు ఓ ప్రకటన రూపంలో తెలుపుతామని రాజకుటుంబ వర్గాలు వెల్లడించాయి. కాగా, దివంగత మైసూరు రాజు శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్, ప్రమోదా దేవి దంపతులకు సంతానం కలుగకుంటే, యదువీర్ గోపాల్ రాజును 2015 ఫిబ్రవరిలో దత్తత తీసుకుని, ఆయనకు సంప్రదాయ కిరీటాన్ని అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో 600 సంవత్సరాల వడయార్ చరిత్రలో యదువీర్ 27వ తరం రాజుగా నిలువగా, రాజస్థాన్ లోని దుంగాపూర్ రాజకుటుంబానికి చెందిన హర్షవర్థన్ సింగ్ కుమార్తె త్రిషికను యదువీర్ గత సంవత్సరం జూన్ 27న వివాహం చేసుకున్నారు.

More Telugu News