Tamilnadu: ఇండిపెండెంట్ ను గెలిపించి నా సత్తా చూపిస్తా!: విశాల్ సవాల్

  • ఆర్కే నగర్ లో ఓ యువకుడికి మద్దతిస్తా
  • నేను చేయాలనుకున్న మంచిని అతనితో చేయిస్తా
  • ఇన్ని సమస్యలు వస్తాయని అనుకోలేదు
  • సినిమాల్లో వచ్చే ట్విస్టులు ఎదురయ్యాయన్న విశాల్

తమిళనాడులో జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ కు ఉప ఎన్నిక జరుగుతున్న వేళ, హై డ్రామా మధ్య హీరో విశాల్ నామినేషన్ ను తిరస్కరించగా, ఇక ఎన్నికల బరిలో తాను నిలిచే అవకాశం లేదని అర్థం చేసుకున్న ఆయన, ఓ స్వతంత్ర అభ్యర్థికి మద్దతిచ్చి, అతన్ని గెలిపిస్తానని అన్నాడు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలకు మేలు చేయాలని భావిస్తే, ఇన్ని సమస్యలు వస్తాయని తాను భావించడం లేదని, సినిమాల్లో వచ్చే ట్విస్టుల్లా ఇవి ఉన్నాయని అన్నాడు.

ఓ అభ్యర్థి స్వతంత్రంగా పోటీ చేయకూడదా? అని ప్రశ్నించిన ఆయన, ప్రధాన పార్టీలకు తాను సవాల్ గా మారుతానని, తన సత్తా చూపించి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఓ యువకుడిని గెలిపిస్తానని, అతని ద్వారా తాను చేయాలనుకున్న మంచిని చేస్తానని అన్నాడు. తొలుత తిరస్కరణ, ఆపై ఆమోదం, తిరిగి తిరస్కరణ... జరిగిన పరిణామాలన్నీ చూస్తుంటే, ఈసీపై కూడా ఒత్తిడి ఉన్నట్టు తనకు అనుమానం వస్తోందని చెప్పాడు. ఎన్నికల వ్యవస్థపైనే నమ్మకం పోయే ఘటనలు జరిగాయని, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పని అన్నాడు. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని విశాల్ డిమాండ్ చేశాడు.

More Telugu News