Virat Kohli: మిలాన్ లో 12న 'విరుష్క' వివాహం?

  • శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ కు దూరంగా ఉన్న కోహ్లీ
  • షూటింగ్ లకు దూరంగా ఉన్న అనుష్క శర్మ
  • 12న విరుష్క జోడీకి వివాహం అంటూ వార్తలు
ఈ నెల 12న టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ వివాహం చేసుకోనున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటికి బలం చేకూరుస్తూ ఈనెల 10 నుంచి జరగనున్న వన్డే, టీ20 సిరీస్ కు కోహ్లీ విరామం తీసుకున్నాడు. ఇదే సమయంలో అనుష్క శర్మ షూటింగ్ లకు విశ్రాంతినిచ్చింది. ఫిబ్రవరి వరకు ఆమె షూటింగ్ లకు దూరంగా ఉండనుంది.

ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఇటలీ వెళ్లనున్నారని, ఫ్యాషన్ డెస్టినేషన్ లలో ఒకటిగా పేరొందిన మిలాన్ నగరంలో వీరి వివాహం జరగనుందని, అనంతరం ఈ నెల 21న రిసెప్షన్ ను సినీ క్రీడా ప్రముఖులకు ఇవ్వనున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అనుష్క మేనేజర్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ తప్పుడు వార్తలని ఆయన చెప్పారు. 
Virat Kohli
Anushka Sharma
marriage

More Telugu News