bihar: పట్నా మహిళా కాలేజీలో జీన్స్, పటియాలా, మొబైల్స్ నిషేధం!

  • బీహార్ రాజధాని పట్నాలోని మగధ్ మహిళా కళాశాలలో కొత్త నిబంధనలు
  • జనవరి 1 నుంచి జీన్స్, పటియాలా డ్రెస్ లపై నిషేధం
  • మొబైల్ ప్రీ జోన్ లో వినియోగించుకోవచ్చు

సంప్రదాయం పేరిట మరో కళాశాల విద్యార్థినుల స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయి. బీహార్‌ రాజధాని పట్నాలోని మగధ్‌ మహిళా కళాశాలలో కొత్త డ్రెస్ కోడ్ ను ప్రవేశపెట్టారు. జనవరి నుంచి కొత్త డ్రెస్ కోడ్ నిబంధనలు అమలులోకి వస్తాయని ఆ కళాశాల ప్రిన్సిపల్ శశిశర్మ తెలిపారు.

 జనవరి 1 నుంచి కళాశాలకు యువతులు జీన్స్, పటియాలా డ్రెస్సులు వేసుకుని రాకూడదు. అలాగే కళాశాల ఆవరణలో మొబైల్స్ వినియోగించకూడదు. అయితే, కళాశాలలోని మొబైల్ ఫ్రీ జోన్ లో వినియోగించుకోవచ్చని శశి శర్మ తెలిపారు. కొంతమంది విద్యార్థులు ధరిస్తున్న దుస్తులు అభ్యంతరకరంగా ఉంటున్నాయని ఆమె చెప్పారు. ఇకపై అటువంటి వాటిని ధరించేందుకు అంగీకరించబోమన్నారు. తమ కాలేజీ పాశ్చాత్య సంస్కృతి కలిగినది కాదని తెలిపిన ఆమె, ప్రతి విద్యార్థిని సంప్రదాయాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. 

More Telugu News