roja ramani: నేను డబ్బింగ్ చెప్పిన పాత్రల్లో నాకు బాగా నచ్చినవి ఇవే!: రోజా రమణి

  • డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 20 సంవత్సరాలు 
  • 400 మంది కథానాయికలకు చెప్పాను 
  • కొన్ని పాత్రలకి చెప్పిన డబ్బింగ్ ఎంతో సంతృప్తిని ఇచ్చింది  

నిన్నటి తరం కథానాయికలలో చాలామందికి రోజా రమణి డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకి గల అనుభవాన్ని గురించి ఆమె తెలుగు పాప్యులర్ టీవీతో పంచుకున్నారు. " నాకు పాటలు కూడా పాడాలని ఉండేది .. కానీ భగవంతుడు నీకు పాట వద్దులే అమ్మా .. మాట చాలు అంటూ నాకు డబ్బింగ్ ఇచ్చాడు. దాంతో నేను 20 సంవత్సరాల పాటు వరుసగా డబ్బింగ్ చెబుతూ వచ్చాను. దాదాపు 500ల సినిమాలకి .. 400 మంది కథానాయికలకు డబ్బింగ్ చెప్పాను" అన్నారు.

 "మీనాకి .. పాత కాలంలో బి.సరోజాదేవి మాదిరిగా చిలక పలుకుల్లా డబ్బింగ్ చెప్పాలి. రమ్యకృష్ణకి వాయిస్ బోల్డ్ గా ఉంటుంది .. రాధ వాయిస్ ను తీసుకుంటే హైపర్ గా ఉంటుంది. ఎవరికి తగినట్టుగా వాళ్లకి డబ్బింగ్ చెప్పవలసి ఉంటుంది. 'సీతారామయ్యగారి మనవరాలు' సినిమాలో మీనా పాత్ర .. 'నిరీక్షణ'లో అర్చన పాత్ర .. 'అంకురం' సినిమాలో రేవతి పాత్ర .. 'ఊర్మిళ'లో మాలాశ్రీ పాత్ర .. 'కంటే కూతుర్నే కను' సినిమాలో రమ్యకృష్ణ పాత్రకి చెప్పిన డబ్బింగ్ నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఈ పాత్రలకి డబ్బింగ్ చెబుతూ నేను పొందిన అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను" అంటూ చెప్పుకొచ్చారు.  

More Telugu News