invisible box challenge: వైర‌ల్ ఛాలెంజ్‌: ఇన్విజిబుల్ బాక్స్‌.. మీరు చేయ‌గ‌లరా?

  • పాప్యుల‌ర్ చేసిన టెక్సాస్ చీర్ లీడ‌ర్‌
  • వీడియోలు పెడుతున్న నెటిజ‌న్లు
  • విజయం సాధిస్తున్నవారు చాలా త‌క్కువ‌

టైంపాస్ ఛాలెంజ్‌లు సోష‌ల్ మీడియాలో చాలానే ఉన్నాయి. కానీ ఇటీవ‌ల ఓ సరికొత్త ఛాలెంజ్ ఒక‌టి విప‌రీత‌మైన వైర‌ల్‌గా మారుతోంది. ఇక రేపో మాపో సెలెబ్రిటీలు కూడా ఈ ఛాలెంజ్ చేయ‌డ‌మే త‌రువాయి. ఆ ఛాలెంజ్ పేరు... ఇన్విజిబుల్ బాక్స్‌.. అంటే క‌నిపించ‌ని డ‌బ్బా అని అర్థం. ఇందులో డ‌బ్బా లేకున్నా ఉన్న‌ట్లుగా ఊహించుకొని దాన్ని ఎక్కి దిగాలి.

టెక్సాస్ ప్రాంతానికి చెందిన చీర్ లీడ‌ర్ ఏరియ‌ల్ ఆలివ‌ర్ ఈ ప్ర‌య‌త్నం చేసి పోస్టు చేసిన వీడియోకు ల‌క్ష‌ల్లో లైకులు, షేర్లు వ‌చ్చాయి. అంతే... నెటిజ‌న్లంద‌రూ ఈ ఛాలెంజ్ ప్ర‌య‌త్నించి వీడియోలు పోస్ట్ చేయ‌డం మొద‌లుపెట్టారు. దీంతో ఈ ఛాలెంజ్ వైర‌ల్‌గా మారింది. నిజానికి మొద‌టిసారిగా ఇలాంటి ప్ర‌య‌త్నాన్ని ఫుట్‌బాల్ ఆట‌గాడు డోంటెజ్ హీన్స్ చేశాడు. కానీ అప్పుడు అంత వైర‌ల్ కాలేదు. ఈ ఛాలెంజ్ చాలా మంది ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ వారిలో అతికొద్ది మంది మాత్ర‌మే ఆలివ‌ర్ చేసిన‌ట్లుగా చేయ‌గ‌లుగుతున్నారు. మిగిలిన వారంతా కింద‌ప‌డి దెబ్బ‌లు త‌గిలించుకుంటున్నారు. మరి మీరు కూడా ప్ర‌య‌త్నించి #InvisibleBoxChallenge ట్యాగ్‌తో పోస్ట్ చేసేయండి.

More Telugu News