rojaramani: రెండు రోజులే ఆడుతుందనుకున్న ఆ సినిమా కొత్త ట్రెండ్ సృష్టించింది: రోజా రమణి

  • హీరోయిన్ పాత్రే .. కానీ పనిపిల్ల 
  • ఏ మాత్రం గ్లామర్ తో పనిలేని పాత్ర 
  • 25 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు 
  • ఆ సినిమా 32 సినిమాలు తెచ్చిపెట్టింది    

తెలుగు .. తమిళ భాషలతో పాటు మలయాళంలోను రోజా రమణి నటించారు. మలయాళంలో తనకి హీరోయిన్ ఛాన్స్ ఎలా వచ్చిందనే విషయాన్ని గురించి ఆమె ప్రస్తావించారు. " నాకు 12 .. 13 సంవత్సరాలు రావడంతో బాలనటిగా చేసే ఛాన్స్ లేకుండా పోయింది. దాంతో ఇక చదువుపై దృష్టి పెట్టమని నాన్న చెప్పారు. అలాంటి సమయంలోనే మలయాళ ఇండస్ట్రీకి చెందిన దర్శక నిర్మాతలు మా ఇంటికి వచ్చారు. వాళ్లు తీయాలనుకుంటోన్న సినిమాలో నన్ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు"

" ఏ మాత్రం గ్లామర్ తో పనిలేని పనిపిల్ల పాత్ర అది. ఏదో ఒకటిలే అనుకుంటూ కొత్త హీరోతో కలిసి ఆ సినిమా చేశాను. 25 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడంతో .. ఎవరు చూస్తారు ఈ సినిమాను .. ఓ రెండు రోజులు ఆడుతుందేమో అనుకున్నాను. ఆ తరువాత మూడు నెలలకి ..  ఆ దర్శక నిర్మాతలను మా ఇంటికి తీసుకొచ్చిన జర్నలిస్ట్ వచ్చాడు. నేను చేసిన సినిమా యూత్ ను ఒక ఊపు ఊపేస్తోందంటూ చెప్పాడు. కావాలంటే కేరళలో తెలిసినవారికి ఫోన్ చేసి కనుక్కోమన్నాడు. నిజంగానే ఆ సినిమా అక్కడ కొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఆ సినిమాయే మలయాళంలో  'చంబరత్తి' .. తెలుగులో 'కన్నె వయసు'. ఆ హిట్ కి కొనసాగింపుగా 32 మలయాళం సినిమాలు చేశాను" అని అన్నారు.    

More Telugu News