garlic: వెల్లుల్లి మసాలా దినుసా? లేక కూర‌గాయా?... రాష్ట్ర ప్రభుత్వ స‌మాధానం కోరిన రాజ‌స్థాన్ హైకోర్టు

  • ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేసిన మార్కెట్ క‌మిటీ
  • జీఎస్టీ విధింపు విష‌యంలో సందిగ్ధ‌త‌
  • వారంలోగా స‌మాధానం చెప్పాల‌ని ఆదేశించిన హైకోర్టు

వెల్లుల్లి మసాలా దినుసా? లేక కూర‌గాయా? అనే విష‌యంపై స్ప‌ష్ట‌త‌నివ్వాల‌ని రాజ‌స్థాన్ హైకోర్టు, ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఇప్ప‌టి వ‌ర‌కు వెల్లుల్లిని అటు మసాలా దినుసుగానూ, కూర‌గాయ‌గానూ కూడా ప‌రిగ‌ణిస్తున్నారు. దీంతో కూర‌గాయ‌ల మార్కెట్‌లో అమ్మిన వెల్లుల్లి మీద ప‌న్ను ఉండ‌టం లేదు, కానీ వ్య‌వ‌సాయ మార్కెట్‌లో అమ్మిన వెల్లుల్లి మీద జీఎస్టీ విధిస్తున్నారు.

దీని వ‌ల్ల సందిగ్ధం ఏర్ప‌డ‌టంతో ఈ విష‌యం గురించి తేల్చాల‌ని జోధ్‌పూర్‌లోని భ‌ద్వాసియా కూర‌గాయ‌ల మార్కెట్ అసోసియేష‌న్ హైకోర్టును ఆశ్ర‌యించింది. వీరి పిల్‌కి మిగ‌తా మార్కెట్ క‌మిటీలు కూడా మద్దతు తెలిపాయి. దీనిపై పూర్తి స్ప‌ష్ట‌త ఇచ్చేందుకు ప్ర‌భుత్వానికి, హైకోర్టు వారం రోజుల గ‌డువునిచ్చింది.

More Telugu News