balakrishna: బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ 'నరసింహనాయుడు'కి సీక్వెల్?

  • వరుస ప్రాజెక్టులను ఓకే చేస్తూ వెళుతోన్న బాలకృష్ణ
  • రీసెంట్ గా ఆయనకి కథ వినిపించిన చిన్నికృష్ణ
  • బాలకృష్ణ నుంచి వెంటనే వచ్చిన గ్రీన్ సిగ్నల్   

బాలకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'నరసింహనాయుడు' ఒకటి. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ వసూళ్లను సాధించిన బాలకృష్ణ సినిమాలలో ఒకటిగా నిలిచింది. మ్యూజికల్ హిట్ గాను మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమాకి, సీక్వెల్ చేయడానికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.

 'నరసింహనాయుడు' సినిమాకి కథను అందించిన చిన్నికృష్ణ .. ఈ సినిమా సీక్వెల్ కి కథ రాసుకుని వెళ్లి రీసెంట్ గా బాలకృష్ణకి వినిపించాడట. ఈ కథ బాగా నచ్చడంతో, చేద్దామని బాలకృష్ణ అంగీకారాన్ని తెలిపినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని అంటున్నారు. బాలకృష్ణ వరుసగా సినిమాలను ఒప్పేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి మరి.    

More Telugu News