Allu Arjun: కొత్త కథతో వచ్చిన కొత్త దర్శకుడు .. ఛాన్స్ ఇచ్చేసిన బన్నీ!

  • బన్నీకి కథ వినిపించిన కొత్త దర్శకుడు 
  • బాక్సింగ్ నేపథ్యంలో కథ 
  • త్వరలో పూర్తి వివరాలు    

వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ 'నా పేరు సూర్య' చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకోవడంతో, బన్నీ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. దాదాపు కొరటాల శివతో ఆయన నెక్స్ట్ మూవీ ఉండవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుతో పాటు మారుతి దర్శకత్వంలోను ఒక సినిమా చేయడానికి బన్నీ సిద్ధమవుతున్నాడు.

 ఈ నేపథ్యంలో సంతోష్ రెడ్డి అనే యువకుడు బన్నీని కలుసుకుని ఓ కథ చెప్పాడట. ఆ కథ చాలా కొత్తగా ఉండటంతో .. తాను ఇంతవరకూ ఆ తరహా పాత్రలను చేయకపోవడంతో వెంటనే బన్నీ ఓకే చెప్పేశాడట. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని వినికిడి. దర్శకుడిగా వక్కంతం వంశీకి ఛాన్స్ ఇచ్చిన బన్నీ .. వెంటనే మరో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ కొత్త ప్రాజెక్టును ఎప్పుడు .. ఏ బ్యానర్లో బన్నీ  చేయనున్నాడనే విషయంలో క్లారిటీ రావాల్సి వుంది.     

  • Loading...

More Telugu News