Ocean: కలల బాయ్ ఫ్రెండ్ కోసం ఆరేళ్లు వెతికింది... దొరికాడని ఆనందించిన నిమిషాల్లోనే తీవ్ర నిరాశ!

  • ప్రియుడిని వెతికేందుకు వినూత్న ఆలోచన
  • బంతిపై ఫోన్ నంబర్ రాసి సముద్రంలో విసిరేసిన హేలీ
  • ఆరేళ్ల తరువాత స్పందన
  • బాల్ అమ్మాయికి దొరికిందని తీవ్ర నిరాశ

తన కలల ప్రియుడిని వెతికేందుకు వినూత్న నిర్ణయం తీసుకుని, ఆరేళ్ల పాటు వేచి చూసిన ఓ యువతి, కల నెరవేరే క్షణంలో తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. యూఎస్ కు చెందిన హెలీ రాబిన్స్ అనే అమ్మాయి, సోషల్ మీడియాలో పంచుకున్న తన సొంత కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. తన ప్రియుడి కోసం వినూత్నంగా ఆలోచించిన ఆమె, ఓ క్రికెట్ బంతిపై తన పేరు, ఫోన్ నంబర్ రాసి, ఆరేళ్ల క్రితం దాన్ని సముద్రంలోకి విసిరేసింది.

ఎప్పటికైనా అది ఓ యువకుడికి దొరుకుతుందని, అతనే తన బాయ్ ఫ్రెండ్ అని నమ్మి ఏళ్లుగా ఎదురుచూసింది. ఇక ఆమె నమ్మకం కోల్పోయిన వేళ, ఆడమ్ అనే స్నాప్ చాట్ ఐడీ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. దీంతో తన కల నెరవేరిందని ఆమె సంబరపడుతూనే, ఫోన్ చేసి మాట్లాడింది. ఆపై హతాశురాలైంది. ఎందుకంటే, ఆమె ఓ యువతి. అలా తన కల నెరవేరకుండా పోయిందని, బాయ్ ఫ్రెండ్ దొరికాడనుకుంటే, ఆ ఆనందం నిమిషాల్లో ఆవిరైందని వాపోయింది.

More Telugu News