Chiranjeevi: మెగాభిమానులకు శుభవార్త... 'సైరా' స్టార్ట్ అయింది!

  • 'సైరా' రెగ్యులర్ షూటింగ్ మొదలు
  • హైదరాబాద్ లో భారీ సెట్ లో షూటింగ్
  • దర్శకత్వం వహిస్తున్న సురేందర్ రెడ్డి
మెగాస్టార్ అభిమానులకు శుభవార్త. చిరంజీవి 151వ చిత్రం 'సైరా' షూటింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించాడు. కొణిదెల కంపెనీ ప్రొడక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి పక్కన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, మరో పాత్రలో ప్రగ్యా జైశ్వాల్, అతిథిగా బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ తదితరులు కూడా కీలక పాత్రధారులేనని చిత్ర టీమ్ ఇప్పటికే ప్రకటించింది.
Chiranjeevi
Saira
Regular Shooting
Hyderabad
Surender Reddy

More Telugu News