talangana: ప్రపంచ నిరక్షరాస్యుల్లో 35 శాతం మంది భారత్ లోనే ఉన్నారు!: యునిసెఫ్ రిపోర్ట్

  • 35 శాతం మంది నిరక్షరాస్యులున్న భారత్ 
  • 34 శాతం నిరక్షరాస్యులున్న తెలంగాణ
  • తెలంగాణలో 8 వేల వయోజన విద్యాకేంద్రాలు

ప్రపంచంలోని నిరక్షరాస్యుల్లో 35 శాతం మంది మన దేశంలోనే ఉన్నారని యునిసెఫ్ విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ నివేదిక చెబుతోంది. యునిసెఫ్ విడుదల చేసిన నిరక్షరాస్యుల జాబితాలో భారత్ లో 35 శాతం మంది నిరక్షరాస్యులున్నట్టు తేలింది. ఇక తెలంగాణలో 34 శాతం మంది నిరక్షరాస్యులున్నారని వయోజన విద్యా సంచాలకుడు బి.సుధాకర్ తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా 8,000 వయోజన విద్యాకేంద్రాలు ఉన్నప్పటికీ, రాత్రి బడుల్లో చదివేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై దృష్టిసారించామని ఆయన అన్నారు. అంతే కాకుండా స్కూళ్లలో డ్రాపవుట్స్ ను తగ్గించాలని, దానిపై కూడా దృష్టిపెట్టామని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News