Rahul Gandhi: కాంగ్రెస్ కు ఓట్లు పడే మార్గంపై రాహుల్ కు సలహా ఇచ్చిన అమిత్ షా!

  • ముందు రామజన్మభూమిపై స్పష్టమైన నిర్ణయానికి రండి
  • గుళ్లు తిరుగుతూ రాజకీయాలెందుకు?
  • రాహుల్ పై అమిత్ షా విమర్శలు

కాంగ్రెస్ పార్టీకి మరిన్ని ఓట్లు రావాలంటే, ముందుగా ఆ పార్టీ కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అయోధ్య రామజన్మ భూమిపై, రామాలయంపై స్పష్టమైన నిర్ణయానికి రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సలహా ఇచ్చారు. 2019 లోక్ సభ ఎన్నికల వరకూ ఈ కేసు విచారణ కూడదని కాంగ్రెస్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న వేళ, అసలు కాంగ్రెస్, రాహుల్ గాంధీ తమ మనసులోని ఉద్దేశమేంటో చెప్పాలని అమిత్ డిమాండ్ చేశారు.

రామ మందిరం విషయంలో ఆ పార్టీ రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించిన ఆయన, హిందువుల ఓట్ల కోసం ఓ వైపు గుళ్లూ గోపురాలను సందర్శిస్తూనే, మరోవైపు ఈ కేసు విచారణను ఆలస్యం చేయాలని ప్రయత్నిస్తోందని తెలిపారు. కాబోయే కాంగ్రెస్ అధ్యక్షుడు తమ వైఖరిని స్పష్టం చేసుకోవాలని అన్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదని, మరెన్నో విషయాల్లో కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ వైఖరేనని అమిత్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News