marriage: జరగాల్సిన పెళ్లిని ఆపి... 18 గంటల్లోనే వధువుకి వివాహం చేసేశారు!

  • దివ్యాంగుడన్న విషయం దాచి పెట్టిన వరుడి కుటుంబ సభ్యులు
  • దండలు మార్చుకునే సమయంలో గుర్తించిన బంధువులు
  • వివాహం రద్దు..18 గంటల్లోనే మరో వివాహం

మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌ లో వివాహవేడుక ఆసక్తి రేపింది. పెళ్లికొడుకు తరపువారు అబద్ధం ఆడి వివాహం జరపాలని చూడగా, వధువు తరపువారు ఆ వివాహాన్ని రద్దు చేసుకుని, 18 గంటలు తిరక్కుండానే మరో సంబంధం వెతికి వివాహం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... గ్వాలియర్ లోని నింబాజీలోని ఖోహ్ కు చెందిన కల్యాణ్ సింగ్ కుమార్తె పింకీకి నారాయణ విహార్ లోని రైతు కుటుంబానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించారు.వరుడు బంధుసమేతంగా విడిదికి వచ్చాడు.

అనంతరం వివాహ తంతులో భాగంగా వధూవరులు దండలు కూడా మార్చుకున్నారు. హోమగుండం చుట్టూ ఏడడుగులు వేయాల్సి ఉంది. ఇంతలో పింకీ తరపు బంధువులు వరుడ్ని దివ్యాంగుడిగా గుర్తించారు. దీంతో వివాహానికి అభ్యంతరం చెప్పారు. వరుడు దివ్యాంగుడని ముందే ఎందుకు చెప్పలేదని నిలదీశారు. దీంతో వివాదం చోటుచేసుకుంది. వధువు తరపు బంధువులు జీవితాంతం తమ ఆడపిల్ల కష్టాలపాలు కావడం ఇష్టం లేదని చెబుతూ, పెళ్లి క్యాన్సిల్ అని స్పష్టం చేశారు.

 దీంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. పోలీసులు ఇరు వర్గాలకు సర్దిచెప్పారు. దీంతో పింకీ బంధువులు 18 గంటల్లోపే మరొక యువకుడ్ని చూసి పెళ్లి చేసేశారు.  

More Telugu News