vishal: సినీన‌టుడు విశాల్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. నామినేష‌న్‌ను అంగీక‌రించిన‌ రిట‌ర్నింగ్ అధికారి!

  • ఆర్కేన‌గ‌ర్ లోని ఉప ఎన్నిక రిట‌ర్నింగ్ కార్యాల‌యం ఎదుట హైడ్రామా
  • ధ‌ర్నాకు దిగిన విశాల్ నుంచి వివ‌ర‌ణ తీసుకున్న రిట‌ర్నింగ్ అధికారి
  • ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ బరిలో విశాల్‌

ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌కు పోటీకి దిగుతూ సినీన‌టుడు విశాల్ వేసిన నామినేషన్‌లో వివ‌రాలు స‌రిగా లేవంటూ రిట‌ర్నింగ్ అధికారి తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే. దీనిపై అభ్యంత‌రం తెలుపుతూ ఆర్కేన‌గ‌ర్ లోని ఉప ఎన్నిక రిట‌ర్నింగ్ కార్యాల‌యం ఎదుట‌ సినీన‌టుడు విశాల్ ధ‌ర్నాకు దిగ‌డంతో అక్కడ హైడ్రామా కొన‌సాగింది.

ఉద్దేశ‌పూర్వ‌కంగానే నామినేష‌న్‌ను తిర‌స్క‌రించారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తూ విశాల్ ఆందోళ‌న నిర్వహించాడు. కాసేప‌టి త‌రువాత రిట‌ర్నింగ్ అధికారి విశాల్ వ‌ద్ద‌కు వ‌చ్చి వివ‌ర‌ణ కోరారు. అదే స‌మ‌యంలో అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు విశాల్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. అనంత‌రం కొద్దిసేప‌టికే విశాల్‌ నామినేష‌న్‌ను రిటర్నింగ్ అధికారి అంగీక‌రించారు. దీంతో ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ బరిలో విశాల్ నిలుస్తున్నాడు.

More Telugu News