surya: హిట్ ఇచ్చిన దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన సూర్య!

  • 'గ్యాంగ్' తో వస్తోన్న సూర్య 
  • రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ 
  • 'నగరం' దర్శకుడికి అవకాశం   

సూర్య కథానాయకుడిగా తమిళంలో చేసిన 'తానా సెరిందా కూట్టమ్' .. తెలుగులో 'గ్యాంగ్' పేరుతో జనవరి 12వ తేదీన  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు సెల్వ రాఘవన్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగానే తాజాగా ఆయన మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు .. లోకేష్ కనగ రాజ్.

  ఈయన సందీప్ కిషన్ తో తమిళంలో 'నగరం' అనే సినిమా చేసి హిట్ కొట్టాడు. రీసెంట్ గా ఆయన ఒక కథ చెప్పగా సూర్యకు బాగా నచ్చేసిందట. దాంతో ఆయన ఈ ప్రాజెక్టును వెంటనే మొదలుపెట్టేద్దాం అని చెప్పారట. ప్రస్తుతం 'గ్యాంగ్' సినిమా పనుల్లో వున్న సూర్య ..  ఆ పనులు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. మొత్తానికి లోకేష్ కనగరాజ్ మంచి ఛాన్సే కొట్టేశాడని చెప్పుకుంటున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.     

More Telugu News