vijay: విజయ్ సినిమా కోసం రంగంలోకి దిగిన బడా నిర్మాత!

  • విజయ్ హీరోగా మురుగదాస్ మూవీ 
  • గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన 'కత్తి' .. 'తుపాకి'
  • తమిళంతో పాటు తెలుగులోను విడుదల

'మెర్సల్' సినిమాతో విజయ్ అనూహ్యమైన విజయాన్ని అందుకున్నాడు. వసూళ్ల పరంగా ఈ సినిమా ఆయన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. అలాంటి సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తన తదుపరి సినిమా చేయడానికి విజయ్ రెడీ అవుతున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడానికి కళానిధి మారన్ ముందుకు వచ్చినట్టు సమాచారం. ఆయన ఎంట్రీతో ఈ సినిమా నిర్మాణం ఒక రేంజ్ లో జరుగుతుందనే టాక్ మొదలైపోయింది .. ఈ ప్రాజెక్టు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గతంలో విజయ్ - మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన 'కత్తి' ..తుపాకి' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. దాంతో సహజంగానే ఈ ప్రాజెక్టు ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడి చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో వున్నారు.      

  • Loading...

More Telugu News