India: అర్ధసెంచరీతో ధావన్ అవుట్... రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా సెంచరీ

  • నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
  • గేరు మార్చి అర్ధ సెంచరీ చేసిన ధావన్
  • 298 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 373 పరుగులకు శ్రీలంక ఆలౌట్ కావడంతో టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. ఆదిలోనే మురళీ విజయ్ (9) వికెట్ కోల్పోయింది. అనంతరం రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రహానే (10) ను చివరికి పెరీరా అవుట్ చేశాడు.

అనంతరం జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోరును వంద పరుగులు దాటించి, అర్థసెంచరీకి చేరువైన పుజారా (49) ను చక్కని బంతితో డిసిల్వా పెవిలియన్ కు పంపాడు. అనంతరం ఓపెనర్ శిఖర్ ధావన్ (61) కు కెప్టెన్ కోహ్లీ (3) జతకలిశాడు. దీంతో ధావన్ గేరు మార్చాడు. అంతవరకు ఓపిగ్గా, నెమ్మదిగా, జాగ్రత్తగా ఆడిన ధావన్ బ్యాటు ఝళిపించడం మొదలు పెట్టాడు.

దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 34 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. అదే జోరులో భారీ షాట్ కు ప్రయత్నించిన ధావన్ స్టంపౌట్ గా పెవిలియన్ చేరాడు. లంక బౌలర్లలో లక్మల్, పెరీరా, డిసిల్వా చెరొక వికెట్ తీశారు. దీంతో శ్రీలంక కంటే టీమిండియా 307 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

More Telugu News