anantapuram: 30 లక్షలు నష్టపోయాను...తిట్టినా మౌనంగా ఉండాలంటే ఎలా?: డీఈపై దాడి చేసిన కాంట్రాక్టర్ నర్సింహారెడ్డి

  • వివిధ పనుల కోసం 30 లక్షలు ఖర్చుపెట్టాను
  • బిల్లులు క్లియర్ చెయ్యమంటే తిప్పించుకుంటున్నాడు
  • ఇంకా గట్టిగా అడిగితే తిడుతున్నాడు
  • డబ్బులు పోగొట్టుకుని తిడుతుంటే పడేదానికి చేతకాని వాణ్ణా?

అనంతపురం పట్టణంలో మున్సిపల్ డీఈపై దాడి చేసి, ‘‘రేయ్! నాది జమ్మలమడుగు. నాతో పెట్టుకోవద్దు. నాక్కానీ తిక్కరేగిందా ఆఫీసుపై బాంబులేస్తా’’ అని హెచ్చరించిన కాంట్రాక్టర్ నర్సింహారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రశ్నించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, వివిధ పనుల నిమిత్తం 30 లక్షల రూపాయలు ఖర్చుపెట్టానని అన్నారు. బిల్లు క్లియరెన్స్ కోసం డీఈ తన చుట్టూ తిప్పించుకుంటున్నాడని ఆరోపించారు.

 అంతటితో ఊరుకోక బిల్లులు ఎప్పుడు క్లియర్ చేస్తారంటే తిడుతున్నాడని తెలిపారు. దీంతో మౌనంగా ఉండడం తనకు చేతకాలేదని అన్నారు. 30 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి, తిడుతుంటే పడడానికి తానేమీ చేతకానివాణ్ని కానని ఆయన చెప్పారు. మీడియా వాళ్లు ఒకవైపే చెబుతున్నారని, తన డబ్బులు ఎవరిస్తారు? తన సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని ఆయన మీడియా ప్రతినిధులను నిలదీశారు. 

More Telugu News