varun tej: 'తొలిప్రేమ' కోసం భారీ మొత్తం వెచ్చించిన దిల్ రాజు

  • వరుణ్ తేజ్ - రాశి ఖన్నాల 'తొలిప్రేమ'
  • దర్శకుడిగా వెంకీ అట్లూరి 
  • దిల్ రాజు చేతికి థియేట్రికల్ హక్కులు     

వరుణ్ తేజ్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'తొలిప్రేమ' చిత్రం రూపొందుతోంది. గతంలో ఇదే టైటిల్ తో పవన్ కల్యాణ్ చేసిన సినిమా సూపర్ హిట్ కావడంతో, ఈ టైటిల్ కి ఎంతో క్రేజ్ వుంది. ఆ క్రేజ్ కారణంగా ఈ సినిమాపై ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నిన్న రిలీజ్ చేసిన ఫస్టులుక్ పోస్టర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ కి యూత్ నుంచి ఎక్కువ మార్కులు పడిపోయాయి.

దాంతో ఈ విషయాన్ని గమనించిన దిల్ రాజు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇంతకుముందు వరుణ్ తేజ్ చేసిన 'ఫిదా' భారీ విజయాన్ని సాధించడం, 'తొలిప్రేమ' ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి మొదలుకావడంతో దిల్ రాజు భారీ మొత్తమే చెల్లించి ఈ ప్రాజెక్టును సొంతం చేసుకున్నట్టు చెబుతున్నారు. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు.  

  • Loading...

More Telugu News